logo

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

గాంధీజీ ఆశయాలైన పరిసరాల పరిశుభ్రత, గ్రామస్వరాజ్యం సాధించే దిశగా అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి పిలుపునిచ్చారు. బవులువాడలోని సంపద కేంద్రం వద్ద ఆదివారం గాంధీ జయంతి పురస్కరించుకుని క్లాప్‌ మిత్రలను సన్మానించారు.

Published : 03 Oct 2022 03:32 IST

మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, అధికారులు

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గాంధీజీ ఆశయాలైన పరిసరాల పరిశుభ్రత, గ్రామస్వరాజ్యం సాధించే దిశగా అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి పిలుపునిచ్చారు. బవులువాడలోని సంపద కేంద్రం వద్ద ఆదివారం గాంధీ జయంతి పురస్కరించుకుని క్లాప్‌ మిత్రలను సన్మానించారు. కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థ నిర్వహణ సమన్వయకర్త నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని 240 పంచాయతీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం పూర్తిగా అమలు చేస్తున్నామన్నారు. పంచాయతీల్లో సేకరించిన వ్యర్థాలను జిందాల్‌ పవర్‌ప్లాంట్‌కి తరలిస్తున్నామన్నారు. సర్పంచి మజ్జి వెంకట లక్ష్మి, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌: మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో వారి చిత్రపటాలకు కలెక్టర్‌ రవి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సచివాలయాలతో నేడు సాధ్యమైందన్నారు. డీఆర్వో వెంకటరమణ, పరిపాలన అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని