logo

తహసీల్దారు కార్యాలయం వేలానికి నోటీసులు

మాడుగులలో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి భూములను తీసుకుని ఇప్పటివరకు నష్ట పరిహారం చెల్లించని కారణంగా ఈనెల 20 లోగా సమస్య పరిష్యరించకపోతే మాడుగుల తహసీల్దారు కార్యాలయం వేలం వేస్తామని తహసీల్దారు పి.వి.రత్నానికి స్థానిక కోర్టు నోటీసులు జారీ చేసింది.

Published : 03 Oct 2022 03:32 IST

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగులలో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి భూములను తీసుకుని ఇప్పటివరకు నష్ట పరిహారం చెల్లించని కారణంగా ఈనెల 20 లోగా సమస్య పరిష్యరించకపోతే మాడుగుల తహసీల్దారు కార్యాలయం వేలం వేస్తామని తహసీల్దారు పి.వి.రత్నానికి స్థానిక కోర్టు నోటీసులు జారీ చేసింది. మాడుగులలో సుమారు 500 మంది లబ్ధిదారులకు గృహాలు నిర్మించేందుకు వీలుగా 1985లో భూ సేకరణ చేశారు. అప్పట్లో సేకరించిన భూములకు సంబంధించి యజమానులకు నష్ట పరిహారం చెల్లించారు. ఈ మొత్తం సరిపోదని భూ యజమానులు కోర్టును ఆశ్రయించారు. వీరికి రూ. 92 లక్షల చెల్లింపులకు వీలుగా 2020లో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించామని తహసీల్దార్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. తాజాగా కోటి రూపాయలకు పైగానే యజమానులకు చెల్లించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నోటీసులో సూచించిన గడువులోగానే ప్రభుత్వం భూ యజమానులకు డబ్బు చెల్లిస్తుందని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని