logo

ప్రయాణికుల తికమక

రైళ్ల సమయాలు మారిన విషయాన్ని గుర్తించని కొందరు రైల్వే ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. చాలా మంది రైళ్లను తప్పడంతో మారిన వేళలను  తెలియజేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 03 Oct 2022 03:32 IST

రైలు సమయాలు మారడంతో గందరగోళం

ఈనాడు, విశాఖపట్నం : రైళ్ల సమయాలు మారిన విషయాన్ని గుర్తించని కొందరు రైల్వే ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. చాలా మంది రైళ్లను తప్పడంతో మారిన వేళలను  తెలియజేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేశాఖ అక్టోబరు 1 నుంచి రైళ్ల సమయాల్లో మార్పు చేసింది. అలాగే కొన్ని రైళ్లను పొడిగించింది. ఇంకొన్ని రైళ్ల వేగం పెంచడం, స్టాపేజీలతో సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తూర్పుకోస్తా, దక్షిణ మధ్య రైల్వే జోన్లకు చెందిన రైళ్లు అధికంగా విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి ప్రారంభమయ్యేవీ ఉన్నాయి. వేళలు మారడాన్ని గుర్తించని చాలామంది ముందుగా బుక్‌ చేసిన టిక్కెట్లలో పేర్కొన్న సమయానికి స్టేషన్‌కు చేరుకొని ఇబ్బందిపడ్డారు. పలువురు చేరుకునే సమయానికి రైళ్లు స్టేషన్‌ను విడిచి వెళ్లిపోయాయి. రైళ్లు తప్పడంపై అధిక సంఖ్యలో ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టులు పెట్టారు. సోమవారం నుంచి ఈ వేళలు మారడం, ఫిర్యాదులు రావడం అధికారులకు కొంత తలనొప్పిగా మారింది. ఎక్కువమంది విశాఖ-టాటా ఇతర కొన్ని రైళ్లను తప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని