logo

రెండోరోజూ.. అదే ఆదరణ

విశాఖ వంటి మహా నగరంలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా స్థిరాస్తి సంస్థలు, బిల్డర్లు, గృహోపకరణాలు, భవన నిర్మాణ సామగ్రి వంటి సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి నిర్వహిస్తున్న ‘ఈనాడు గ్రాండ్‌ ప్రాపర్టీ ఎక్స్‌పో-2022’కు చివరి రోజు ఆదివారం కూడా విశేష ఆదరణ లభించింది.

Published : 03 Oct 2022 03:32 IST

ముగిసిన ‘ఈనాడు గ్రాండ్‌ ప్రాపర్టీ ఎక్స్‌పో-22’

సందర్శకుల రద్దీ

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : విశాఖ వంటి మహా నగరంలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా స్థిరాస్తి సంస్థలు, బిల్డర్లు, గృహోపకరణాలు, భవన నిర్మాణ సామగ్రి వంటి సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి నిర్వహిస్తున్న ‘ఈనాడు గ్రాండ్‌ ప్రాపర్టీ ఎక్స్‌పో-2022’కు చివరి రోజు ఆదివారం కూడా విశేష ఆదరణ లభించింది. బీచ్‌రోడ్డులో నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన ఈ ఎక్స్‌పో సందర్శకుల తాకిడితో కళకళలాడింది. ఉదయం నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో రావటంతో స్థిరాస్తి సంస్థలు, బిల్డర్లు తమ వెంచర్ల విశిష్టతలను, ఆయా సంస్థలు అందిస్తున్న రాయితీల గురించి విపులంగా వివరించారు. గృహోపకరణాల ఉత్పత్తులను విక్రయించే స్టాల్‌్్స వద్దకు వెళ్లిన సందర్శకులు ఇంటికి అందాన్నిచ్చే ఉత్పత్తుల గురించి ఆరా తీశారు.

* ఈ ఎక్స్‌పోలో సుమారు 35 స్టాల్స్‌ ద్వారా ప్రముఖ స్థిరాస్తి సంస్థల వ్యాపారులు, బిల్డర్లు తమ వివరాలను ప్రదర్శనకు ఉంచారు. ఆయా సంస్థలు నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు, వ్యక్తిగత ఇళ్లు, అపార్టుమెంట్‌లు, గేట్‌వే కమ్యూనిటీ సిటీ, డూప్లెక్సులు, విల్లాలతో పాటు ఆయా సంస్థలు అందుబాటులోకి వచ్చిన ఇంటి స్థలాలు, వాటి ధరలతో సమగ్ర వివరాలను పూర్తిస్థాయిలో అందించారు. ఆకర్షణీయమైన బ్రోచర్లను సందర్శకులకు అందజేశారు. సంస్థలు వాయిదాల పద్ధతిలో చెల్లింపు అవకాశాన్ని కూడా ఆయా సంస్థల ప్రతినిధులు విపులంగా సందర్శకులకు వివరించారు. పలు బ్యాంకులు కూడా రుణాలు, వాయిదాల వివరాలను అందించాయి. ఇళ్లకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించిన వెంటనే రుణాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనకు జిల్లాలోని నలమూలల నుంచి సందర్శకులు అత్యధిక సంఖ్యలో హాజరై, వారికి అవసరమైన స్థిరాస్తి, ఇళ్లు, ఇంటి స్థలాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ద్విచక్రవాహనాలకు చెందిన పలు కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శనకు ఉంచాయి. ప్రస్తుతం ఎక్కువ అమ్మకాలు జరుగుతున్న ఎలక్ట్రికల్‌ వాహనాలను సైతం ప్రదర్శనలో ఉంచటంలో పలువురు సందర్శకులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు.

సందర్శకులకు తమ ప్రాజెక్టులు వివరిస్తున్న ప్రతినిధులు

* గత రెండు రోజులుగా జరిగిన ‘ఈనాడు గ్రాండ్‌ ప్రాపర్టీ ఎక్స్‌పోకు’ టైటిల్‌ స్పాన్సర్‌గా ఎంకే బిల్డర్స్‌-ఎంకే వన్‌ ప్రాజెక్టు, అసోసియేట్‌ స్పాన్సర్లుగా భూమాత రియల్‌ ఎస్టేట్స్‌ అండ్‌ డెవలపర్స్‌, హనీ గ్రూపులు వ్యవహరించాయి. ఆదివారం సాయంత్రం సీఎంఆర్‌ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ మావూరి బాలాజీ ముఖ్యఅతిథిగా పాల్గొని లక్కీడ్రా ద్వారా గెలుపొందిన 20 మంది విజేతలకు బహుమతులు అందజేశారు.

లక్కీడ్రా తీస్తున్న సీఎంఆర్‌ సంస్థ ఎం.డి. మావూరి బాలాజీ

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts