logo

ఆహారం కలుషితమై భవానీలకు అస్వస్థత

పాయకరావుపేట మండలం గోపాలపట్నంలో ఆహారం కలుషితమై భవానీ భక్తులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన భవానీ భక్తుడు రామవలస రమణ ఇంటి వద్ద శుక్రవారం రాత్రి పూజ కార్యక్రమం జరిగింది.

Published : 03 Oct 2022 03:32 IST

తుని, మంగవరం ఆసుపత్రుల్లో చికిత్స

తుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులు

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పాయకరావుపేట మండలం గోపాలపట్నంలో ఆహారం కలుషితమై భవానీ భక్తులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన భవానీ భక్తుడు రామవలస రమణ ఇంటి వద్ద శుక్రవారం రాత్రి పూజ కార్యక్రమం జరిగింది. పూజ అనంతరం వందమంది భవానీలకు అల్పాహారంగా ఇడ్లీ, పాలు అందజేశారు. వీటిని ఆహారంగా తీసుకున్న భవానీలు శనివారం నుంచి వాంతులు, విరేచనాలు, తలనొప్పితో ఇబ్బంది పడుతూ సమీపంలోని మంగవరం, తుని ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో కర్రి అప్పలరాజు, చింతాకుల శ్రీను, రమణ, నిహారిక, అప్పలకొండ, సూరిబాబు, దుర్గాప్రసాదు తదితర 35 మందికిపైగా భవానీలతోపాటు పలువురు గ్రామస్థులు ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో ఇన్‌ పేషెంట్లుగా చేరారు. మంగవరం పీహెచ్‌సీ వైద్యాధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ.. భక్తులు తీసుకున్న ఆహారం కలుషితం కావడంతోనే వాంతులు, విరేచనలతో ఇబ్బంది పడ్డారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. గోపాలపట్నం గ్రామంలో తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. ఈఓఆర్డీ చంద్రశేఖరరావు, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వైద్యాధికారి మురళీకృష్ణ సిబ్బందితో గోపాలపట్నంలో వైద్య శిబిరం నిర్వహించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు చేశారు. స్వల్ప జ్వరాలు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని శిబిరానికి తీసుకువచ్చారు. రక్షిత నీటిని తాగాలని, ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని