logo

అయ్యన్నతో తెదేపా నేతల భేటీ

తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ, తదనంతర పరిణామాల నేపథ్యంలో పలువురు తెదేపా నేతలు ఆదివారం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి వచ్చారు.

Published : 03 Oct 2022 03:32 IST

అయ్యన్నతో మాట్లాడుతున్న యనమల కృష్ణుడు, పక్కన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ, తదనంతర పరిణామాల నేపథ్యంలో పలువురు తెదేపా నేతలు ఆదివారం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి వచ్చారు. అయ్యన్నతో భేటీ అయి తాజా పరిణామాలపై చర్చించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ నాయకుడు యనమల కృష్ణుడు, తాండవ సుగర్స్‌ మాజీ ఛైర్మన్‌ సుర్ల లోవరాజు, కోటనందూరు మాజీ ఎంపీపీ గాది రాజబాబు, మాడుగుల మాజీ శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు తదితరులు అయ్యన్నను కలిసిన వారిలో ఉన్నారు. అయ్యన్న వారితో మాట్లాడుతూ.. సీఐడీ అధికారుల దురుసు ప్రవర్తనపై ఇప్పటికే హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

రాష్ట్రం పరువు తీస్తున్న సీఐడీ అధికారులు: బుద్ద

అనకాపల్లి: సీఐడీ అధికారుల తీరు కారణంగా రాష్ట్రం పరువు పోతుందని జిల్లా తెదేపా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఒక ప్రకటనలో ఆరోపించారు. తెదేపా ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు చింతకాయల విజయ్‌ ఇంటిపై అధికారులు హల్‌చల్‌ చేయడం సిగ్గు చేటన్నారు. సీఐడీ వైకాపాకు అనుబంధ సంస్థగా పనిచేస్తోందన్నారు. న్యాయమూర్తులు ఎన్ని మెట్టికాయులు పెట్టినా వీరి తీరుమారడం లేదన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని