logo

పర్యాటకురాలిగా వచ్చి.. విగతజీవిగా మారి..

విశాఖ సందర్శన కోసం వచ్చిన ఓ మహిళ సముద్రంలో మునిగి మృతిచెందింది. మూడో పట్టణ పోలీసులు అందించిన వివరాలు..హైదరాబాద్‌ విరాట్‌నగర్‌, కర్మాన్‌ఘాట్‌ ప్రాంతాలకు చెందిన 11 మంది 1వ తేదీన విశాఖకు వచ్చి ఎంవీపీ కాలనీ గాదెరాజుప్యాలెస్‌లో దిగారు.

Published : 03 Oct 2022 03:32 IST

మృతిచెందిన సబిఆజం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : విశాఖ సందర్శన కోసం వచ్చిన ఓ మహిళ సముద్రంలో మునిగి మృతిచెందింది. మూడో పట్టణ పోలీసులు అందించిన వివరాలు..హైదరాబాద్‌ విరాట్‌నగర్‌, కర్మాన్‌ఘాట్‌ ప్రాంతాలకు చెందిన 11 మంది 1వ తేదీన విశాఖకు వచ్చి ఎంవీపీ కాలనీ గాదెరాజుప్యాలెస్‌లో దిగారు. ఆదివారం ఉదయం బీచ్‌రోడ్డు చూడాలని వై.ఎం.సి.ఎ. తీరానికి చేరుకున్నారు. 11 మందిలో ఇద్దరు తప్ప మిగతావారంతా సముద్ర స్నానాలకు దిగారు. వీరిలో సబిఆజం (38) అలలను దాటి లోపలకు వెళ్తుండగా భర్త షఫియుద్దీన్‌ హెచ్చరించారు. ఈలోగా పెద్ద కెరటం ఆమెను సముద్రంలోనికి నెట్టేసింది. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ రాజులునాయుడు ఆమెను ఒడ్డుకు తీసుకొచ్చి సమీప ఆసుపత్రికి తరలించగా, కాసేపటికే మృతిచెందింది. సి.ఐ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై రాము కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని