logo

అప్పన్న క్షేత్రంలో.. నేడు శమీ పూజోత్సవం

సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం శమీ పూజోత్సవం (జమ్మివేట) సంప్రదాయబద్ధంగా జరగనుంది.

Published : 05 Oct 2022 04:44 IST

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం శమీ పూజోత్సవం (జమ్మివేట) సంప్రదాయబద్ధంగా జరగనుంది.  స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామి.. శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. శమీ పూజోత్సవాన్ని పురస్కరించుకుని సింహగిరి పైనుంచి స్వామివారు మెట్లమార్గం గుండా కొండ దిగువన పూలతోటకు తరలిరానున్నారు. వనంలోని జమ్మి చెట్టుకు పూజలు చేసి శమీ పత్రాలను స్వామికి సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి సింహగిరిపై భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని అధికారులు తెలియజేశారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని