logo

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో 8 మందికి బంగారు పతకాలు

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఎలమంచిలికి చెందిన 11 మంది క్రీడాకారులు పతకాలు సాధించారని శిక్షకుడు నగిరెడ్డి సత్యనారాయణ చెప్పారు. వీరిలో ఎనిమిది మంది బంగారు పతకాలు సాధించారన్నారు.

Published : 05 Oct 2022 04:44 IST

బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఎలమంచిలికి చెందిన 11 మంది క్రీడాకారులు పతకాలు సాధించారని శిక్షకుడు నగిరెడ్డి సత్యనారాయణ చెప్పారు. వీరిలో ఎనిమిది మంది బంగారు పతకాలు సాధించారన్నారు. ఇద్దరు రజత, ఒకరు కాంస్య పతకాలు సాధించారన్నారు. నెల్లూరులో సెప్టెంబర్‌ 29 నుంచి ఆక్టోబరు రెండో తేదీ వరకు నాలుగు రోజుల పాటు నాలుగో ఏపీ కప్‌ తైక్వాండో పోటీలు జరిగాయి. పతకాలు సాధించిన వారిలో తుంపాల శ్వేత, ఆర్‌.పల్లవి, ఉండా జయ, ఉండా మౌనిక, నగిరెడ్డి మోహిత, విష్ణువర్ధన్‌, ఎల్‌.లహరి, నందకృష్ణ, వై.జశ్వంత్‌, వి.సౌజన్య, తదితరులు ఉన్నారన్నారు. ఎలమంచిలి నుంచి ఈ పోటీల్లో 14 మంది పాల్గొనగా 11 మంది పతకాలు సాధించడం అభినందనీయమని సత్యనారాయణ అన్నారు. వీరి విజయంపై ఏపీ తైక్వాండో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అచ్యుతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చింనాయుడు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని