logo

Fancy Numbers: వైజాగ్‌లో ఫ్యాన్సీ నెంబర్లకు భారీగా చెల్లించాల్సిందే...

నూతన వాహనాల రిజిస్ట్రేషన్‌ సమయంలో పొందే ఫ్యాన్సీ నంబర్లకు భారీగా పెంచిన ఫీజులు అమల్లోకి వచ్చాయి. దీనికి సంబంధించి వాహన చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విశాఖ నగరంలో ఫ్యాన్సీ నెంబర్ల మోజు చాలా ఎక్కువ.

Updated : 10 Oct 2022 10:47 IST

9999 నెంబర్‌కు రూ.2 లక్షలు

మాధవధార, న్యూస్‌టుడే

నూతన వాహనాల రిజిస్ట్రేషన్‌ సమయంలో పొందే ఫ్యాన్సీ నంబర్లకు భారీగా పెంచిన ఫీజులు అమల్లోకి వచ్చాయి. దీనికి సంబంధించి వాహన చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విశాఖ నగరంలో ఫ్యాన్సీ నెంబర్ల మోజు చాలా ఎక్కువ. సెంటిమెంట్‌గా భావించే వారు కావాల్సిన నెంబర్‌ను కొనుగోలు చేసేందుకు ఇక నుంచి భారీగా డబ్బులు చెల్లించాల్సిందే. అయితే ఒకేసారిగా పాత ధరలను మించి మూడు, నాలుగింతలు పెంచడం, రాష్ట్ర వ్యాప్త పోటీ కారణంగా సామాన్యులకు భారంగా మారనుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రాధాన్యత ఉన్న 9999 నెంబర్‌కు రూ.50వేల నుంచి రూ.2లక్షలకు ఫీజు పెంచారు. 1, 9, 999 నెంబర్లకు రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచారు. 

భారీగా ఆదాయం వస్తుండటంతో..

రాష్ట్రంలో 2019 నుంచి ఏపీ 39 సిరీస్‌ వచ్చింది.  ఒక సిరీస్‌తోనే రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్‌ జరగడంతో ఆ సిరీస్‌ నెంబర్లు త్వరగా అందుబాటులోకి వస్తున్నాయి. పాత పద్ధతిలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మూడు, నాలుగు రోజుల్లోనే పలుమార్లు బిడ్‌ వేసి కావాల్సిన నెంబర్‌ను దక్కించుకోగలుగుతున్నారు. దీంతో ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం పెరిగింది. 

ఏడు విభాగాలుగా పెంచి.. 

గతంలో డిమాండ్‌ను బట్టి 150 నెంబర్ల వరకు ఫ్యాన్సీ నెంబర్లుగా గుర్తించి ప్రభుత్వం వాటికి రూ.50వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలుగా నాలుగు విభాలుగా ఫీజులు పెట్టింది. ప్రస్తుతం అవే నెంబర్లకు రూ.2 లక్షలు, రూ.లక్ష, రూ.50వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేల చొప్పున ఏడు విభాగాలుగా మార్చింది.

పెంచిన ధరలిలా..  

* 9999 - రూ.2లక్షలు

* 1, 9, 999 - రూ.లక్ష 

* 99, 3333, 4444, 5555, 6666, 7777   - రూ.50వేలు 

* 5, 6, 7, 333, 369, 555, 666, 777, 1111, 1116, 1234, 2277, 3339, 3366, 3456, 3699, 3939, 4455, 4545, 4599, 6669, 6789, 8055, 8888 - రూ.30వేలు 

* 3, 111, 123, 234, 567, 1188, 1818, 1899, 1999, 2222, 2799, 3636, 3999, 5678, 5999, 6999, 7999, 9009 - రూ.20వేలు. 

వీటితో పాటుగా మరికొన్ని ఫ్యాన్సీ నెంబర్లను పొందాలంటే రూ.15వేలు, రూ.10వేలుగా ఫీజులను నిర్ణయించారు. ఫ్యాన్సీ నెంబర్లు కావాల్సిన వారు ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు బిడ్‌ వేసి పొందాల్సి ఉంటుంది. దీంతో ఆదాయం పెద్ద ఎత్తున్న రానున్నది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని