logo

ఫీట్లు కావు.. కళాశాలకెళ్లడానికి పాట్లు

ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరం. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లోనూ ఆర్టీసీ పరిమిత సంఖ్యలో బస్సులను నడుపుతుండటంతో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు కిక్కిరిసిన బస్సులకు వేలాడుతూ రాకపోకలు సాగిస్తున్నారు.

Published : 26 Nov 2022 02:32 IST

న్యూస్‌టుడే, నర్సీపట్నం: ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరం. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లోనూ ఆర్టీసీ పరిమిత సంఖ్యలో బస్సులను నడుపుతుండటంతో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు కిక్కిరిసిన బస్సులకు వేలాడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. నర్సీపట్నం - అడ్డురోడ్డు మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సుల ఫుట్‌బోర్డుపై పదుల సంఖ్యలో నిలబడి, కొందరు ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణించడం నిత్యం కనిపిస్తోంది. అసలే రోడ్లు బాగో లేవు. కారణం ఏదైనా.. చేయి జారితే కన్నవారికి కడుపుకోతే మిగులుతుంది. ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి రద్దీ మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని