logo

బురద దాటితేనే బడికి!!

రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులున్న పాఠశాలల్లో చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ఒకటి. అలాంటిచోట పరిస్థితిని పై చిత్రంలో చూడొచ్చు. శుక్రవారం వర్షానికి క్రీడామైదానం బురదమయమైంది.

Updated : 26 Nov 2022 13:47 IST

చంద్రంపాలెం ఉన్నత పాఠశాల మైదానంలో విద్యార్థుల అవస్థలు

కొమ్మాది, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులున్న పాఠశాలల్లో చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ఒకటి. అలాంటిచోట పరిస్థితిని పై చిత్రంలో చూడొచ్చు. శుక్రవారం వర్షానికి క్రీడామైదానం బురదమయమైంది. విద్యార్థులు తరగతి గదులకు వెళ్లేందుకు  ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమస్యపై పలుమార్లు ‘ఈనాడు’లో కథనాలు ప్రచురించడంతో ఎమ్మెల్యే ముత్తంశెట్టి స్పందించారు. క్రీడామైదానం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఆ మేరకు గత నెల 19న భీమిలి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త ముత్తంశెట్టి మహేష్‌ నేతృత్వంలో జీవీఎంసీ, సమగ్రశిక్ష అధికారులు పాఠశాల క్రీడామైదానాన్ని పరిశీలించారు. వర్షపునీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, నాడు-నేడులో మంజూరైన రూ.15 లక్షలతో వెంటనే పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయినా నేటికీ కార్యరూపం దాల్చలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు