logo

‘అక్షయపాత్ర’కు వాహనం వితరణ

ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందించేందుకు వీలుగా గంభీరం అక్షయ పాత్ర ఫౌండేషన్‌ సంస్థకు నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ ఒక వాహనాన్ని వితరణగా సమకూర్చారు.

Published : 26 Nov 2022 02:32 IST

వాహనం తాళం చెవిని అందిస్తున్న దృశ్యం

ఆనందపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందించేందుకు వీలుగా గంభీరం అక్షయ పాత్ర ఫౌండేషన్‌ సంస్థకు నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ ఒక వాహనాన్ని వితరణగా సమకూర్చారు. సీఎస్‌ఆర్‌ నిధుల కింద సుమారు రూ.10 లక్షలు విలువ గల ఈ వాహనాన్ని ఫౌండేషన్‌ ప్రతినిధులకు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఏజీఎం పీఎస్‌ఎన్‌ కుమార్‌, దుర్గాప్రసాద్‌, అక్షయపాత్ర ప్రతినిధులు వి.రామమోహన్‌, ప్రవీణ్‌కుమార్‌, బి.రామారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు