logo

‘రాజారెడ్డి రాజ్యాంగాన్ని తిప్పికొడదాం’

వెన్నుపోట్లు, గొడ్డలి పోట్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

Published : 27 Nov 2022 05:04 IST

ఎలమంచిలి పాత జాతీయ రహదారిపై ర్యాలీలో బుద్ద, చలపతిరావు తదితరులు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: వెన్నుపోట్లు, గొడ్డలి పోట్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ శనివారం ఎలమంచిలిలో తెదేపా నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, తెదేపా సీనియర్‌ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుద్ద మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని అడ్డం పెట్టుకుని భారీగా ప్రభుత్వ భూములు కొల్లగొట్టి, కోట్ల రూపాయలు సంపాదించిన తరువాత ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్‌దేనన్నారు. జగన్‌ని ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన చెల్లెలు షర్మిల పాదయాత్ర చేస్తే ఆమెకు వెన్నుపోటు పొడిచాడన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించి వారి ఓట్లతో గెలిచిన జగన్‌ వారిని మోసం చేశారన్నారు. చంద్రబాబునాయుడిని విమర్శించే హక్కు జగన్‌కి లేదన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తుందన్నారు. జగన్‌ మళ్లీ జైలుకి వెళ్లడం ఖాయం అన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి దూళి రంగనాయకులు, అన్నం వెంకట్రావు, కొలుకులూరి విజయబాబు, దిన్‌బాబు, కాండ్రకోట చిరంజీవి, గొర్లె నానాజీ, ఆడారి ఆదిమూర్తి, రమణబాబు, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, మజ్జి రామకృష్ణ, దొడ్డి శ్రీనివాసరావు, డ్రీమ్స్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని