logo

రాజ్యాంగ పరిరక్షణ సమష్టి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ సమష్టి బాధ్యతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తాల గోపి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌లో శనివారం జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.

Updated : 27 Nov 2022 05:21 IST

ర్యాలీలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తాల గోపి, తదితరులు

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: రాజ్యాంగ పరిరక్షణ సమష్టి బాధ్యతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తాల గోపి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌లో శనివారం జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పౌరులు తమ న్యాయ, రాజ్యాంగ హక్కులను అనుభవించడంతోపాటు దేశ పరిరక్షణ బాధ్యతలను కూడా నిర్వర్తించాలన్నారు. న్యాయసేవల సాధికార సంస్థ సేవలను ఉపయోగించుకోవడంతోపాటు, న్యాయ సదస్సుల ద్వారా చట్ట పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. మొదట కార్యక్రమానికి హాజరైన వారితో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ పీఠికను చదివించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కె.కె.వి.బులికృష్ణ, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు బైపా అరుణ్‌కుమార్‌, న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వైద్యుల రవీంద్రప్రసాద్‌, యల్లపు వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని