YSRCP: వైకాపా నేత ఇంట్లో పెళ్లి.. ఊరంతా ఇబ్బంది
విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతానికి చెందిన వైకాపా నేత ఇంట్లో పెళ్లి ఊరందరికీ ఇబ్బంది కలిగించేలా మారిందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రహదారిలో వేసిన కర్రలు
పెందుర్తి, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతానికి చెందిన వైకాపా నేత ఇంట్లో పెళ్లి ఊరందరికీ ఇబ్బంది కలిగించేలా మారిందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా గ్రామీణ జిల్లా మాజీ అధ్యక్షుడు శరగడం చిన్న అప్పలనాయుడు కుమారుడి వివాహం నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పెందుర్తి - విశాఖ, పెందుర్తి - కొత్తవలస రహదారిలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద గుంతలు తవ్వి కర్రలతో రహదారులకు అడ్డంగా వీటిని ఏర్పాటు చేయడం వల్ల వాహన చోదకులు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇరుకు రహదారి కావడంతో తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది. రోడ్డు ధ్వంసమవడంతో పాటు, చీకట్లో కర్రలు కనిపించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పనులను అడ్డుకున్నా కొనసాగించడం కొసమెరుపు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Crime News
Hyderabad: భాగ్యనగరంలో పేలుడు పదార్థాల కలకలం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భద్రత కుదింపు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్
-
Politics News
Andhra News: మూడేళ్లలో జగన్ సర్కార్ చేసిన అప్పు రూ.1.34 లక్షల కోట్లే: మంత్రి బుగ్గన