logo

పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యం

పర్యాటకుల భద్రత కోసం తీరంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. ఆర్‌.కె.బీచ్‌ వద్ద శనివారం సాయంత్రం గజ ఈతగాళ్లకు నియామకపత్రాలను ఆయన అందజేశారు.

Published : 27 Nov 2022 05:04 IST

నియామక పత్రాలతో లైఫ్‌సేవింగ్‌ గార్డులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : పర్యాటకుల భద్రత కోసం తీరంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. ఆర్‌.కె.బీచ్‌ వద్ద శనివారం సాయంత్రం గజ ఈతగాళ్లకు నియామకపత్రాలను ఆయన అందజేశారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ బీచ్‌కు వచ్చే పర్యాటకుల భద్రత కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. విశాఖలో 40 కిలోమీటర్ల తీర ప్రాంతమంతా వాటర్‌ స్పోర్ట్స్‌ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. సముద్రంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడానికి రోబోటిక్‌ బోట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అనంతరం రోబోటిక్‌ బోటు పనితీరును ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్‌, అదీప్‌రాజు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని