దివ్యాంగులకు రాయితీతో కార్లు
దివ్యాంగులకు ప్రభుత్వం కార్ల కొనుగోలుపై ప్రత్యేక రాయితీలు కల్పించడపై గ్లోబల్ ఎయిడ్ సంస్థ సీఈవో సాయిపద్మ కృతజ్ఞతలు తెలిపారు.
కారు తాళాలు అందిస్తున్న చీఫ్ జనరల్ మేనేజర్ అబ్బాస్
పెదవాల్తేరు, న్యూస్‌టుడే : దివ్యాంగులకు ప్రభుత్వం కార్ల కొనుగోలుపై ప్రత్యేక రాయితీలు కల్పించడపై గ్లోబల్ ఎయిడ్ సంస్థ సీఈవో సాయిపద్మ కృతజ్ఞతలు తెలిపారు. సిరిపురం వరుణ్ షోరూంలో శనివారం ఉదయం ప్రభుత్వం కల్పించిన రాయితీతో ఆమె కారు కొనుగోలు చేశారు. వరుణ్ చీఫ్ జనరల్ మేనేజర్ అబ్బాస్ ఖాన్ ఆమెకు కారు తాళం అందించారు. అనంతరం అబ్బాస్ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేక తరహా కార్లు అందిస్తోందన్నారు. కార్లు కొనాలనుకున్న దివ్యాంగులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, దానికి ఆర్.టి.ఒ. కూడా అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 16 శాతం రాయితీ ఇస్తుందని తెలిపారు. డిసెంబర్ 3న దివ్యాంగుల కోసం కార్ల మేళా నిర్వహిస్తున్నామన్నారు. బ్రాంచ్ మేనేజర్ నవీన్‌కుమార్, గ్లోబల్ ఎయిడ్ సెక్రటరీ జ్ఞానానందం సిబ్బంది పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్