logo

36,078 రైతులకు 6.91 కోట్ల వడ్డీ రాయితీ

జిల్లాలో పంట రుణాలు సకాలంలో చెల్లించిన 36,078 మంది రైతులకు రూ. 6.91 కోట్ల వడ్డీ రాయితీగా అందిస్తున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ భీశెట్టి వెంకటసత్యవతి తెలిపారు.

Published : 29 Nov 2022 03:29 IST

నమూనా చెక్కును రైతులకు అందిస్తున్న మంత్రి అమర్‌, ఎంపీ సత్యవతి, కలెక్టర్‌ రవి తదితరులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో పంట రుణాలు సకాలంలో చెల్లించిన 36,078 మంది రైతులకు రూ. 6.91 కోట్ల వడ్డీ రాయితీగా అందిస్తున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ భీశెట్టి వెంకటసత్యవతి తెలిపారు. స్థానిక గుండాల కూడలి వద్ద ఉన్న సచివాలయంలో జిల్లాస్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ వడ్డీ రాయితీ చెక్కు రైతులకు అందజేశారు. అధిక వర్షాలతో పంట నష్టపోయిన 994 మందికి పెట్టుబడి రాయితీగా రూ. 44.50 లక్షల చెక్కు అందించారు. గతంలో వివిధ కారణాల వల్ల అందని వడ్డీ రాయితీ, పెట్టుబడి రాయితీని ఇప్పుడు అందజేసినట్లు వ్యవసాయశాఖ జిల్లా అధికారిణి జి.లీలావతి తెలిపారు. గత ఖరీఫ్‌, రబీ సీజన్‌లో పంట రుణాలు తీసుకున్న 20,451 మంది రైతులకు రూ. 3.70 కోట్లు, గతంలో వివిధ కారణాలతో ఆగిపోయిన 15,627 మంది రైతులకు రూ. 3.21 కోట్లు వడ్డీ రాయితీని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. గత సెప్టెంబరు, అక్టోబరులో కె.కోటపాడు, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట మండలాల్లో పంట నష్టపోయిన 48 మంది సాగుదారులకు రూ. 1.13 లక్షలు, 2021 ఖరీఫ్‌లో పంట దెబ్బతిన్న 946 మందికి రూ. 43.37 లక్షలు అందించామన్నారు. కార్యక్రమంలో కలెక్టరు రవి పట్టన్‌శెట్టి, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షులు చిక్కాల రామారావు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌ పల్లా చినతల్లి, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ పలకా యశోద, వైకాపా నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్‌, మందపాటి జానకిరామరాజు, జాజుల రమేష్‌, మళ్ల బుల్లిబాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని