logo

హెచ్చరిక బోర్డులు మళ్లొచ్చాయ్‌..!

కశింకోట మండలం విస్సన్నపేటలోని ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ అధికారులు తిరిగి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

Updated : 29 Nov 2022 04:50 IST

ప్రభుత్వ సీలింగ్‌ భూమిలో హెచ్చరిక బోర్డులు తిరిగి ఏర్పాటుచేసిన రెవెన్యూ అధికారులు

కశింకోట, న్యూస్‌టుడే: కశింకోట మండలం విస్సన్నపేటలోని ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ అధికారులు తిరిగి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో వైకాపా నాయకులు ప్రైవేట్‌ లేఅవుట్‌కు రోడ్డును విస్తరించేందుకు రూ. కోట్ల్ల విలువైన సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ భూముల్లో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులు వాటిని పీకి అవతల పడేశారు. ‘అక్రమార్కుల బరితెగింపు’ శీర్షికన ‘ఈనాడు’లో ఈనెల 24న ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు తహసీల్దారు బి.సుధాకర్‌, సర్వేయరు దినేష్‌, సిబ్బందితో కలిసి ఆక్రమిత స్థలాలను సందర్శించి, రెండుచోట్ల హెచ్చరిక బోర్డులను తిరిగి ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తుంటామని, హెచ్చరిక బోర్డులు తొలగించాలని చూస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని గ్రామంలో దండోరా వేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని