logo

పరిహారానికి పట్టు

ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం-రేగుపాలెం మధ్య చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం కారు ఢీకొన్న ప్రమాదంలో మృతిచెందిన వారికి పరిహారం అందించాలంటూ బంధువులు ఎలమంచిలిలో ఆందోళనకు దిగారు.

Published : 29 Nov 2022 03:29 IST

మృతదేహాలకు ఆలస్యంగా పోస్టుమార్టం

పోలీసుస్టేషన్‌ ముందు ఆందోళన చేస్తున్న మృతుల బంధువులు

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం-రేగుపాలెం మధ్య చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం కారు ఢీకొన్న ప్రమాదంలో మృతిచెందిన వారికి పరిహారం అందించాలంటూ బంధువులు ఎలమంచిలిలో ఆందోళనకు దిగారు. ఈ ప్రమాదంలో ఎలమంచిలి మండలం పద్మనాభరాజుపేటకు చెందిన ఎడ్ల గోవిందరావు, కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరానికి చెందిన అన్నాచెల్లెళ్లు మొల్లేటి శివాజీ, భీశెట్టి కుమారి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం సాయంత్రం వరకు శవపరీక్షలు నిర్వహించనీయకుండా బంధువులు అడ్డుకున్నారు. నష్ట పరిహారం చెల్లించాలంటూ గ్రామీణ పోలీసుస్టేషన్‌ ముందు బైఠాయించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కారు యజమానులు, మృతుల బంధువులకు మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇరువర్గాలు ఓ అంగీకారానికి రావడంతో ఆందోళన విరమించారు. అనంతరం శవపరీక్షలు నిర్వహించి బంధువులకు మృతదేహాలను అప్పగించారు. ప్రమాదానికి కారణమైన విశాఖ నగరంలోని షీలానగర్‌కు చెందిన కారు డ్రైవరు పాలపోలు నాగ వెంకటగోపాల్‌ను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని గ్రామీణ ఎస్సై సన్నిబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని