logo

పాస్‌లు ఎందరికి దక్కేనో?

త్వరలో విశాఖలో జరిగే నావికాదళ దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానుండడంతో నౌకాదళ అధికారులు, పోలీసులు భారీఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Published : 29 Nov 2022 03:29 IST

రాష్ట్రపతి రాక నేపథ్యంలో తీరంలో భారీ ఏర్పాట్లు

ఈనాడు, విశాఖపట్నం: త్వరలో విశాఖలో జరిగే నావికాదళ దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానుండడంతో నౌకాదళ అధికారులు, పోలీసులు భారీఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రావడం ఇదే తొలిసారి. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భారత నౌకాదళాధిపతి, ముఖ్యమంత్రి కూడా కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఆ రోజున నౌకాదళ అధికారులు నిర్వహించే ఒళ్లుగగుర్పొడిచే విన్యాసాలను తిలకించడానికి భారీఎత్తున ప్రజలు విశాఖ తీరానికి వస్తారు. గత సంవత్సరం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు నేతలు కార్యక్రమాన్ని వీక్షించటానికి ఆసక్తి చూపించినా తగిన సంఖ్యలో పాస్‌లు ఇవ్వకపోవడంతో చాలా మంది అసంతృప్తికి గురయ్యారు. ఈ ఏడాది రాష్ట్రపతి రాక నేపథ్యంలో ఎంతమందికి పాస్‌లు ఇస్తారన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. నౌకాదళ అధికారులు మాత్రం భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. నీ వివిధ పేర్లతో సాగిన నౌకాదళ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇప్పటి వరకు ముగ్గురు రాష్ట్రపతులు విశాఖకు వచ్చారు. తాజాగా ద్రౌపదీ ముర్ము రానున్నారు. 2006లో ‘రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష’(పి.ఎఫ్‌.ఆర్‌.)లో పాల్గొనడానికి నాటి రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్ధుల్‌ కలామ్‌ విశాఖ వచ్చారు. 2016లో ‘అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష’(ఐ.ఎఫ్‌.ఆర్‌.)కు ప్రణబ్‌ముఖర్జీ హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పి.ఎఫ్‌.ఆర్‌.కు రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని