logo

సింహగిరి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

సింహగిరి ఘాట్రోడ్డులో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పన్న స్వామి దర్శనానికి వచ్చిన దంపతులు గాయపడ్డారు.

Updated : 29 Nov 2022 05:01 IST

లోయలో పడిన ద్విచక్ర వాహనం  

గాయపడిన దంపతులు

బాధితులను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరి ఘాట్రోడ్డులో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పన్న స్వామి దర్శనానికి వచ్చిన దంపతులు గాయపడ్డారు. ఆ వివరాలిలా.. నగరంలోని సీతంపేట సమీప బీటీఆర్‌ కాలనీకి చెందిన వంకా కాశిబాబు (52), అమ్మాజీ(46) దంపతులు ఎనిమిదేళ్ల మనుమరాలు జ్ఞానేశ్వరి, బంధువులతో కలిసి అప్పన్న స్వామి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం సుమారు 2గంటల సమయంలో ఘాట్రోడ్డులో కిందికి వెళ్తుండగా ఎన్టీఆర్‌ ఘాట్ సమీప మలుపు వద్ద మనుమరాలితో కలిసి కాశిబాబు దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం రక్షణ గోడను ఢీకొని లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో కాశిబాబు దంపతులు 20 అడుగుల లోయలోకి, జ్ఞానేశ్వరి రోడ్డుపై పడిపోయారు. గమనించిన ఇతర భక్తులు దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో లోయలో నుంచి బాధితులను బయటకు తీసుకువచ్చి దేవస్థానం అంబులెన్సులో సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదంలో అమ్మాజీ కాలుకు, కాశిబాబు తలకు తీవ్రగాయాలైనట్లు ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, ఈఈ శ్రీనివాసరాజు బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన చోట ఇనుక కంచె ఏర్పాటు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు