logo

కేరళ రైలు కిక్కిరిసె..!

సాధారణ రద్దీతో పాటు అయ్యప్ప స్వామి భక్తులతో పలు రైళ్లు సామర్థ్యానికి మించి కిక్కిరిసి పోతుండటంతో తూ.కో. రైల్వే అధికారులు కేరళ వైపు వెళ్లే పలు రైళ్లలో కచ్చితమైన టికెట్లు లేని వారిని దింపేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Published : 29 Nov 2022 03:29 IST

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: సాధారణ రద్దీతో పాటు అయ్యప్ప స్వామి భక్తులతో పలు రైళ్లు సామర్థ్యానికి మించి కిక్కిరిసి పోతుండటంతో తూ.కో. రైల్వే అధికారులు కేరళ వైపు వెళ్లే పలు రైళ్లలో కచ్చితమైన టికెట్లు లేని వారిని దింపేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా కేరళ వైపు వెళ్లే బొకారో ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు వారంతపు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి దర్శనమిచ్చాయి. రైలు విశాఖ చేరుకోగానే ఆర్పీఎఫ్‌, టికెట్‌ తనిఖీ సిబ్బంది కచ్చితమైన టికెట్‌ లేని ప్రయాణికుల్ని రైళ్ల నుంచి కిందకు దించేస్తున్నారు. మధ్యలో ప్రయాణాలు ఆగిపోవడంతో పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే సోమవారం అల్పూజా నుంచి ధన్‌బాద్‌ వెళ్తున్న బొకారో రైలులో కనీసం కాలు మోపేందుకు అవకాశం లేకపోవడంతో పలువురు ప్రయాణికులు సాధారణ బోగీ మరుగుదొడ్డిలో నిలబడి వందలాది కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తున్న దృశ్యం కనిపించింది.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు