logo

భాజపా కార్యవర్గ పదవికి తోట నగేష్‌ రాజీనామా

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ పూర్వ అధ్యక్షులు తోట నగేష్‌ ప్రకటించారు.

Published : 29 Nov 2022 03:29 IST

రాజీనామా పత్రాన్ని చూపుతున్న నగేష్‌

సీతంపేట, న్యూస్‌టుడే : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ పూర్వ అధ్యక్షులు తోట నగేష్‌ ప్రకటించారు. శ్రీనగర్‌లోని విశాఖ పౌరగ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో తన రాజీనామా పత్రాన్ని చూపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేరిట లేఖ రాశారు.  పార్టీ నాయకత్వం సహకరించకపోయినా తాను పార్టీ పటిష్టతకు పనిచేస్తూనే ఉన్నానని తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో తమ అనకాపల్లి జిల్లాకు గుర్తింపులేని స్థాయిని ఉత్తరాంధ్ర పెద్దలు కల్పించారన్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగలేనన్నారు. కావున తన రాజీనామా ఆమోదించాల్సిందిగా కోరారు. ఇకపై పార్టీలో సామాస్య కార్యకర్తగా కొనసాగుతానని చెప్పారు. పాయకరావుపేట పరిధిలో గల అనేక పరిశ్రమల్లో తన ప్రమేయం లేకుండానే పార్టీ ఫండ్‌ పేరుతో పలువురు వసూళ్లకు పాల్పడ్డారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని