logo

నమూనా విన్యాసాలు అదరహో..

నేవీ డే పురస్కరించుకొని తూర్పునావిదళం ఆధ్వర్యంలో తీరంలో సోమవారం నమూనా విన్యాసాలు నిర్వహించారు. యుద్ధ సమయంలో నావికాదళం ఎలా స్పందిస్తుంది? శత్రువులపై ఎలా ఎదురుదాడికి దిగుతుందో విన్యాసాల రూపంలో చెప్పారు.

Published : 29 Nov 2022 03:29 IST

న్యూస్‌టుడే, పెదవాల్తేరు: నేవీ డే పురస్కరించుకొని తూర్పునావిదళం ఆధ్వర్యంలో తీరంలో సోమవారం నమూనా విన్యాసాలు నిర్వహించారు. యుద్ధ సమయంలో నావికాదళం ఎలా స్పందిస్తుంది? శత్రువులపై ఎలా ఎదురుదాడికి దిగుతుందో విన్యాసాల రూపంలో చెప్పారు. గగనంలో యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతూ బాంబులు వేయడం వంటి విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శనలు చూడటానికి పెద్దఎత్తున నగర ప్రజలు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో సముద్రంలో యుద్ధ నౌకలు విద్యుత్తు వెలుగులతో కనువిందు చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని