logo

ఒకటి మినహా... 25 అంశాలకు ఆమోదం

మహా విశాఖ నగర పాలక సంస్థలో గురువారం నిర్వహించిన స్థాయీ సంఘం సమావేశంలో 26 అంశాలపై చర్చించిన సభ్యులు ఒక అంశాన్ని వ్యతిరేకించారు.

Updated : 02 Dec 2022 06:46 IST

స్థాయీ సమావేశంలో మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్‌ గొలగాని హరి వెంకట కుమారి... పాల్గొన్న సభ్యులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగర పాలక సంస్థలో గురువారం నిర్వహించిన స్థాయీ సంఘం సమావేశంలో 26 అంశాలపై చర్చించిన సభ్యులు ఒక అంశాన్ని వ్యతిరేకించారు. మిగతా అంశాలన్నింటికీ ఆమోదం తెలిపారు. మేయరు, స్థాయీ ఛైర్‌పర్సన్‌ హరి వెంకట కుమారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ కార్మికులకు సబ్బులు, కొబ్బరినూనె కొనుగోలకు రూ.48.74లక్షల వ్యయం చేయనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి యాప్రాన్స్‌ కొనుగోలుకు రూ.28.12 లక్షలు వ్యయం చేయనున్నారు. 68వ వార్డులో మింది, అక్కిరెడ్డిపాలెం శ్మశానాల అభివృద్ధికి రూ.1.30 కోట్లు కేటాయించారు. హోల్‌సేల్‌ ఫ్రూట్‌ మార్కెట్‌లోని ‘దుకాణం యజమాని మార్పు’ అంశానికి ఆమోదించారు. మార్కెట్‌ వివాదాల్లో ఉన్నా ఈ ‘మార్పు’నకు అంగీకరించారు. ఎక్కువ మొత్తంలో ఆస్తి పన్ను విధింపును వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన ఐదుగురి పన్ను  తగ్గిస్తూ తీర్మానం చేసిన సభ్యులు.. జీవీఎంసీకి నష్టం చేకూరేలా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. జీవీఎంసీ మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ పూర్తిగా వైఫల్యం చెందారని సభ్యులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని