logo

ఏజెన్సీకి నిర్వహణ అప్పగించొద్దు

మహా విశాఖ నగరపాలక సంస్థలో పొరుగుసేవల ద్వారా సేవలందిస్తున్న కార్మికుల పీఎఫ్‌, ఈఎస్‌ఐ నిధుల నిర్వహణ పనులను ప్రయివేటు ఏజెన్సీకి అప్పగించడానికి గురువారం స్థాయీ సమావేశంలో పొందుపరచిన అంశాన్ని సభ్యులు వ్యతిరేకించారు.

Published : 02 Dec 2022 04:45 IST

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌: మహా విశాఖ నగరపాలక సంస్థలో పొరుగుసేవల ద్వారా సేవలందిస్తున్న కార్మికుల పీఎఫ్‌, ఈఎస్‌ఐ నిధుల నిర్వహణ పనులను ప్రయివేటు ఏజెన్సీకి అప్పగించడానికి గురువారం స్థాయీ సమావేశంలో పొందుపరచిన అంశాన్ని సభ్యులు వ్యతిరేకించారు. ఎలాంటి ప్రయోజనం లేని, జీవీఎంసీకి ఆర్థికంగా ఇబ్బంది కలిగించే ఈ అంశాన్ని మరెప్పుడూ స్థాయీ సమావేశం అజెండాలో పొందుపరచకూడదని తీర్మానించి, దానిని ఆమోదించారు.

* ‘ప్రయివేటు సంస్థపై ఎంత ప్రేమో’ శీర్షికతో గురువారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మేయరు, స్థాయీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పొరుగుసేవల కార్మికులకు ప్రభుత్వం అప్కోస్‌ ద్వారా వేతనాలు ఇస్తుందని, ప్రభుత్వం పీఎఫ్‌, ఈఎస్‌ఐ నిధుల కోత, జమ వంటి పనులను చేస్తుండగా ప్రయివేటు ఏజెన్సీకి అప్పగించడం వల్ల ఆర్థికభారంగా పరిణమిస్తుందని ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకువచ్చింది.

* కథనానికి స్పందించిన మేయరు, స్థాయీ ఛైర్‌పర్సన్‌ గొలగాని హరి వెంకట కుమారి ఆ అంశాన్ని వాయిదా వేస్తే మళ్లీ అజెండాలోకి వస్తుందని భావించి, ఏజెన్సీలకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ నిధుల బాధ్యత అప్పగించకూడదని భావిస్తూ, దానిని ఆమోదించారు. దీని వల్ల జీవీఎంసీకి ఏడాదికి రూ.26 లక్షల వరకు ఆదా కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని