logo

భోగమండపం నుంచి అప్పన్న దర్శనాలకు అనుమతి

కరోనా నేపథ్యంలో సుమారు వంద అడుగుల దూరంలో నీలాద్రి గుమ్మం వద్ద నుంచి అప్పన్న స్వామిని దర్శించుకుంటున్న భక్తులకు ఇకపై ఆ ఇబ్బంది లేకుండా ట్రస్టుబోర్డు సభ్యులు, ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.

Published : 02 Dec 2022 04:45 IST

ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న ట్రస్టుబోర్డు సభ్యులు

సింహాచలం, న్యూస్‌టుడే: కరోనా నేపథ్యంలో సుమారు వంద అడుగుల దూరంలో నీలాద్రి గుమ్మం వద్ద నుంచి అప్పన్న స్వామిని దర్శించుకుంటున్న భక్తులకు ఇకపై ఆ ఇబ్బంది లేకుండా ట్రస్టుబోర్డు సభ్యులు, ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఆలయాన్ని సందర్శించిన దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ సూచనల మేరకు గురువారం నుంచి ఉచిత, రూ.100 శీఘ్ర దర్శనం భక్తులు భోగమండపం నుంచి స్వామిని దర్శించుకుంటున్నారు. ఆ మేరకు క్యూలైన్ల ఏర్పాట్లపై ట్రస్టీలు దినేశ్‌రాజ్‌, సతీశ్‌, శ్రీదేవి ఆలయ ఏఈవో నరసింహరాజు, పర్యవేక్షకుడు పిళ్లా శ్రీనివాసరావుతో చర్చించారు. రూ.300 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు అంతరాలయ దర్శనం కొనసాగుతుందన్నారు. ఈ మార్పుతో స్వామిని మరింత దగ్గరగా దర్శించుకోవచ్చునని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని