logo

అపరాధ రుసుము కట్టలేదని.. టికెట్లు చించేశారు

సాధారణ బోగీలో కనీసం కాలు మోపేందుకు కూడా అవకాశం లేకపోవడంతో.. ధన్‌బాద్‌ నుంచి అలెప్పీ వెళ్తున్న రైలులో పలువురు ప్రయాణికులు రిజర్వేషన్‌ బోగీలో నిలబడి ప్రయాణాలు సాగించారు.

Published : 02 Dec 2022 04:45 IST

టికెట్లు చింపిపడేయడంతో ఆవేదనలో...

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: సాధారణ బోగీలో కనీసం కాలు మోపేందుకు కూడా అవకాశం లేకపోవడంతో.. ధన్‌బాద్‌ నుంచి అలెప్పీ వెళ్తున్న రైలులో పలువురు ప్రయాణికులు రిజర్వేషన్‌ బోగీలో నిలబడి ప్రయాణాలు సాగించారు. అయితే రైలు విశాఖ చేరుకోగానే... కొంత మంది సాధారణ ప్రయాణికుల్ని పట్టుకున్న టికెట్‌ తనిఖీ సిబ్బంది రిజర్వేషన్‌ బోగీలో ఇప్పటి వరకు ప్రయాణం సాగించినందుకు అపరాధ రుసుములు చెల్లించాలని వారి దగ్గర ఉన్న సాధారణ టికెట్లు తీసుకొని డిమాండ్‌ చేశారు. తమ వద్ద అంత డబ్బులు లేవని, తప్పనిసరి పరిస్థితిలో బోగీలోకి వెళ్లాల్సి వచ్చిందని తమ టికెట్లు ఇచ్చేస్తే... సాధారణ బోగీలోకి వెళ్లిపోతామని వేడుకున్నారు. వారిని ఆ రైలు ఎక్కకుండా అడ్డుకున్న తనిఖీ సిబ్బంది కొందరు రైలు వెళ్లిపోయిన తరువాత వారి ఎదురుగానే ఆ టికెట్లును చింపి పడేసి స్టేషన్‌ బయటకు పంపించేశారు. అయితే వారిలో ఒడిశాకు చెందిన ఒక కుటుంబం తమ వద్ద మళ్లీ టికెట్టు తీసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో... స్టేషన్‌ బయట బిక్కుబిక్కుమంటూ ‘న్యూస్‌టుడే’ కంటపడ్డారు. ఈ విషయాన్ని స్టేషన్‌లోని ఓ ఉద్యోగి వద్ద ప్రస్తావించగా మానవతా దృక్పథంతో వారికి విశాఖ నుంచి సాధారణ టికెట్లు సమకూర్చి వేరే రైలులో వెళ్లేందుకు అవకాశం కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని