logo

ఆకట్టుకున్న నృత్య మిలాన్‌

భారత్‌, ఇండోనేషియా కళాకారులతో నిర్వహించిన నృత్యమిలాన్‌ ఆకట్టుకుంది.

Published : 02 Dec 2022 04:45 IST

భారత్‌, ఇండోనేషియా కళాకారులతో నిర్వహించిన నృత్యమిలాన్‌ ఆకట్టుకుంది. శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌లో గురువారం ఒడిస్సీ నృత్యకారిణి శ్రీరాధాపాల్‌, ఇండోనేషియాకు చెందిన కొరియోగ్రాఫర్‌ జోకో సుభిద్యో, నృత్యకారుడు సంజీవ్‌కుమార్‌ జీనా బృందం ప్రదర్శన ఇచ్చింది. సీతాపహరణం సన్నివేశాన్ని కళాకారులు ప్రదర్శించారు. వేదన, ఆగ్రహం, ఉక్రోషం హావభావాలను అద్భుతంగా పలికించారు. రెండు దేశాల సంప్రదాయాలను యువతకు పరిచయం చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని శ్రీరాధాపాల్‌ పేర్కొన్నారు. వాయిద్యకారుడు దిమాస్‌ అదినాడ రాహర్జా, సీనియర్‌ ప్రిన్సిపల్‌ ఎంవీవీఎస్‌ మూర్తి పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, పాయకరావుపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని