logo

మా సొమ్ములు తిరిగివ్వండి

జగనన్న కాలనీ పేరుతో మంజూరైన ఇళ్లు నిర్మిస్తానంటూ నమ్మించి ఆనక ముఖం చాటేసిన చోడవరానికి చెందిన గుత్తేదారు తులసీరామ్‌ను శనివారం మహిళలు చుట్టుముట్టారు

Published : 04 Dec 2022 06:45 IST

ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళలు

రోలుగుంట, న్యూస్‌టుడే: జగనన్న కాలనీ పేరుతో మంజూరైన ఇళ్లు నిర్మిస్తానంటూ నమ్మించి ఆనక ముఖం చాటేసిన చోడవరానికి చెందిన గుత్తేదారు తులసీరామ్‌ను శనివారం మహిళలు చుట్టుముట్టారు. రూ. 25 వేలు చెల్లిస్తే జగనన్న ఇళ్లు నిర్మించి ఇస్తామని తులసీరామ్‌ ఎనిమిది నెలల కిందట సుమారు రూ. 8 లక్షలు వసూలు చేశాడు. లబ్ధిదారులకు మంజూరైన సామగ్రి తీసుకొని ఇళ్లు నిర్మించకుండా పరారయ్యాడు. దీనిపై ‘ఈనాడు’లో గతనెల 25న ‘జగనన్న ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై మండల అధికారులు, నాయకులు స్పందించి గుత్తేదారు తులసీరామ్‌ను తక్షణమే రోలుగుంట రావాలని ఆదేశించారు. శనివారం వచ్చిన ఆయనను మహిళలంతా చుట్టుముట్టి నిలదీశారు. దీనిపై స్థానిక నాయకులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని