logo

తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..

గ్రామీణ ప్రాంతం నుంచి పనుల మీద పట్టణానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 04 Dec 2022 05:28 IST

సబ్బవరం, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతం నుంచి పనుల మీద పట్టణానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై ఎల్‌.సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సబ్బవరం మండలం బాటజంగాలపాలెం గ్రామానికి చెందిన నారపిని వరహాలు(57), పడాల నూకరాజు శనివారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై సబ్బవరం వచ్చి పనులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా అనకాపల్లి - ఆనందపురం జాతీయ రహదారి బాటజంగాలపాలెం సమీపంలో వాహనం అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొట్టారు. దీంతో వరహాలు అక్కడికక్కడే మృతి చెందగా నూకరాజు తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడు నూకరాజును వెంటనే 108 అంబులెన్స్‌పై అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వరహాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


మృతదేహాల అప్పగింత

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : ఎండాడలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత భవననిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో మరణించిన జి.గోవింద్‌, అల్లు తిరుపతిల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించామని ఆరిలోవ శాంతిబధ్రతల ఎస్సై జి.అప్పారావు తెలిపారు. సంఘటనా స్థలంలో స్థానికుల నుంచి భవన నిర్మాణ గుత్తేదారు నుంచి వివరాలు సేకరించామన్నారు. ప్రాథమిక నివేదిక తయారు చేశామన్నారు. మరిన్ని వివరాలను మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించాల్సి ఉందన్నారు. సీఐ ఇమ్మానుయేల్‌రాజు ఆధ్వర్యంలో అన్నికోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని