logo

రూ.1.80 లక్షలతో ఇంటి నిర్మాణం సాధ్యమా?!

జగనన్న కాలనీల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Published : 06 Dec 2022 03:26 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

జెడ్సీకి వినతిపత్రం అందజేస్తున్న రామకృష్ణ, తదితరులు

వేపగుంట, న్యూస్‌టుడే: జగనన్న కాలనీల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. టిడ్కో ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి సత్వరమే లబ్ధిదారులకు అందజేయాలన్నారు. వేపగుంట జోనల్‌ కార్యాలయం ముందు సోమవారం  సీపీఐ పెందుర్తి ఏరియా సమితి చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో 60 గజాల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే కనీసం రూ.15 లక్షలు అవుతుందన్నారు. కేవలం రూ.1.80 లక్షలు మాత్రమే ఇస్తే పేదలు ఎలా ఇల్లు కట్టుకుంటార[ని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ల వద్ద ఎటువంటి వసతులు కల్పించకుండా లబ్ధిదారులు గృహాల్లోకి దిగిపోవాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్నీ ఉచితంగా ఇస్తున్నామని చెప్పి తిరిగి రూ.35 వేలు కట్టాలని నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జోనల్‌ కమిషనరు మల్లయ్య నాయుడుకు అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ సమితి నాయకులు ఆర్‌.శ్రీనివాసరావు, ఎ.అన్నపూర్ణ, వై.త్రినాధ్‌, ఎన్‌.అసిరినాయుడు, ఎం. రాము, జి.మల్లేశ్‌, వి.లక్ష్మి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు