logo

జగన్‌ను ఇంటికి పంపాల్సిందే: తెదేపా

సీఎం జగన్‌ను ఇంటికి పంపకపోతే మన జీవితాలు మరింత దుర్భరంగా మారతాయని జిల్లా తెదేపా అధ్యక్షుడు బుద్ద నాగజదేశ్వరరావు అన్నారు.

Published : 06 Dec 2022 03:26 IST

వెంకన్నపాలెం ర్యాలీలో తెదేపా నేతలు బుద్ద, తాతయ్యబాబు, మల్లునాయుడు

చోడవరం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ను ఇంటికి పంపకపోతే మన జీవితాలు మరింత దుర్భరంగా మారతాయని జిల్లా తెదేపా అధ్యక్షుడు బుద్ద నాగజదేశ్వరరావు అన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి వెంకన్నపాలెం, అంభేరుపురంలో తెదేపా నేతలు పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు, ఇబ్బందులను తెలసుకున్నారు. రాష్ట్రానికి పట్టిన ఖర్మను ప్రజలకు వివరించారు. బుద్ద మాట్లాడుతూ కేవలం తమ ఆస్తులను మరింత పెంచుకునే ప్రయత్నం తప్ప ప్రజల అవసరాలను సీఎం ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మార్కెట్లో ధరల పరిస్థితిని తెలిపారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ వైకాపా హయాంలో నియోజకవర్గంలో వీసమెత్తు అభివృద్ధి జరగలేదన్నారు. ఇక్కడి నాయకులు అక్రమ చర్యలతో ప్రజలు విసిగిపోయారని ఆయన చెప్పారు. తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లంటూ రైతులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఈ ప్రాంతంలో సాగునీటి వనరులను పెద్దలు గాలికి వదిలేశారని ఆయన అన్నారు. మండల తెదేపా అధ్యక్షుడు బొడ్డేడ గంగాధర్‌, ఎంపీటీసీ సభ్యుడు మురిగితి రమణ, మాజీ సర్పంచి బూర రమణ, ఉరిగిటి శ్రీనివాస్‌, కేదారిశెట్టి గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని