logo

సమస్యలపై కదం తొక్కిన నేవీ నిర్వాసితులు

నావికాస్థావరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల ప్రజలు మంగళవారం మహాపాదయాత్ర చేపట్టారు. ఉదయం పది గంటలకు మొదలై మధ్యాహ్నం 12 గంటలకు తహసీల్దారు కార్యాలయానికి చేరింది.

Published : 07 Dec 2022 03:05 IST

ప్రసంగిస్తున్న ఐకాస నాయకుడు, పక్కన మాజీ ఎంపీ చలపతిరావు

రాంబిల్లి, న్యూస్‌టుడే: నావికాస్థావరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల ప్రజలు మంగళవారం మహాపాదయాత్ర చేపట్టారు. ఉదయం పది గంటలకు మొదలై మధ్యాహ్నం 12 గంటలకు తహసీల్దారు కార్యాలయానికి చేరింది. నిర్వాసితులు, జేఏసీ, అఖిలపక్ష సంఘాల నాయకులు అక్కడ బైఠాయించి నినాదాలు చేశారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌, తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి లాలం భాస్కరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.లోకనాధం డిమాండు చేశారు. వైకాపా మండల నాయకులు జి.వి.వి.రమణమూర్తిరాజు (శ్రీనుబాబు) పిన్నమరాజు కిషోర్‌రాజు పాదయాత్ర ప్రారంభంలో కొంత దూరం నిర్వాసితులతో కలిసి పాల్గొన్నారు. తమ డిమాండ్లపై తహసీల్దారు పి.భాగ్యవతికి నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నావికాస్థావరం ప్రధాన ద్వారం వద్ద ధర్నాను విరమించేది లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. పాదయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా అదనపు ఎస్పీ బి.విజయభాస్కర్‌, డీఎస్పీలు శ్రీనివాసరావు, సునీల్‌ పర్యవేక్షణలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. స్థానిక ఎస్సై డి.దీనబంధు మరికొందరు ఎస్సైలు నిర్వాసితుల పాదయాత్రను అనుసరించారు.

తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో బైఠాయింపు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని