logo

అలన మీనాక్షికి ‘వుమెన్‌ ఫిడే మాస్టర్‌’ టైటిల్‌

విశాఖ చదరంగం క్రీడాకారిణి కోలగట్ల అలన మీనాక్షి వుమెన్‌ ఫిడే మాస్టర్‌ (డబ్ల్యూఎఫ్‌ఎం) టైటిల్‌ సాధించింది.

Published : 07 Dec 2022 03:05 IST

న్యూస్‌టుడే, విశాఖ క్రీడలు: విశాఖ చదరంగం క్రీడాకారిణి కోలగట్ల అలన మీనాక్షి వుమెన్‌ ఫిడే మాస్టర్‌ (డబ్ల్యూఎఫ్‌ఎం) టైటిల్‌ సాధించింది. స్పెయిన్‌ దేశం బార్సిలోనాలో ఈనెల 5 నుంచి 11 వరకు ఫిడే చెస్సేబుల్‌ శిబిరం జరుగుతోంది. అందులో పాల్గొన్న అలన మీనాక్షికి టైటిల్‌ ఖరారైంది. ఆమె ‘2120 ఎలో’ రేటింగ్‌లో కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 350 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ శిబిరంలో 11 మంది యువ క్రీడాకారులు ఇప్పటి వరకు టైటిల్స్‌ గెలుపొందగా అందులో మీనాక్షి ఒకరు కావడం గమనార్హం. ఫిడే రేటింగ్స్‌ ప్రకారం ఈ ఏడాది మే వరకు అండర్‌-11 విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌గా, 2021 డిసెంబరు వరకు అండర్‌-10 విభాగంలో ప్రపంచ నెంబర్‌ టూగా రేటింగ్‌ కలిగి ఉంది. 2018లో వుమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌ (డబ్ల్యూసీఎం) టైటిల్‌ను దక్కించుకుంది. 11ఏళ్ల అలన మీనాక్షి టైటిల్‌ సాధించడంపై విశాఖ చదరంగం క్రీడాకారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని