logo

మూడో గురువారం పూజలకు విస్తృత ఏర్పాట్లు

కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మూడో గురువారం పూజలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 07 Dec 2022 03:05 IST

సిద్ధమైన లడ్డూ ప్రసాదాలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మూడో గురువారం పూజలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో మార్పులు, ప్రసాదాల తయారీ, ట్రాఫిక్‌ మళ్లింపు, తాగునీరు, మజ్జిగ సరఫరా వంటి అంశాలపై దృష్టి సారించారు. సాధారణంగా మూడో గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆరోజున అమ్మవారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని మిగిలిన అయిదు జిల్లాల నుంచి అధికంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఈవో శిరీష తెలిపారు.

అమ్మవారి ఆలయంలో ప్రసాదాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మూడో గురువారం నాటికి 30వేల లడ్డూలు, 50వేల పులిహోర, 20 వేల చక్కర పొంగలి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నామని ఏఈఓ వి.రాంబాబు తెలిపారు.

వాహనాలను మెయిన్‌రోడ్డులోని సున్నపువీధి నుంచి సీబీఎం హైస్కూల్‌ మీదుగా వెనుక రహదారిలో పాతపోస్టాఫీసు వైపు మళ్లిస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం మున్సిపల్‌ స్టేడియం, ఘోషాస్పత్రి వెనుక రహదారి, టౌన్‌హాలు రోడ్డు, కురుపాం మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

సీతారామస్వామి ఆలయం నుంచి మొదలయ్యే వీఐపీ, రూ.500 టికెట్ల దర్శనాల క్యూలైన్లను కొద్దిగా మార్పు చేస్తున్నామని, ఆలయ ఆవరణలో రద్దీ తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని ఈఈ సీహెచ్‌.వి.రమణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు