logo

‘జయహో బీసీ’ సభకు 59 ఆర్టీసీ బస్సులు

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విజయవాడలో నిర్వహించనున్న జయహో బీసీ సభకు విశాఖ నగరం నుంచి 59 బస్సులను ఆర్టీసీ సమకూర్చింది.

Published : 07 Dec 2022 03:05 IST

హనుమంతువాక వద్ద నిరీక్షిస్తున్న ప్రయాణికులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విజయవాడలో నిర్వహించనున్న జయహో బీసీ సభకు విశాఖ నగరం నుంచి 59 బస్సులను ఆర్టీసీ సమకూర్చింది. వాటిలో సిటీ బస్సులు 15 కాగా, మిగతావి అల్ట్రాడీలక్స్‌, సూపర్‌ లగ్జరీలు ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, టెక్కలి, పలాస, రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి కూడా బస్సులు సభకు వెళ్లిపోవడంతో మంగళవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్దుబాటులో భాగంగా ఆర్టీసీ అధికారులు ఆర్డినరీ సర్వీసులను ఎక్స్‌ప్రెస్‌లుగా నడిపారు. అయినా కొరత నెలకొనడంతో బస్‌స్టాపుల్లో ప్రయాణికులు పడిగాపులు కాసి, చివరకు ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. నగరంలోనూ సిటీ బస్సులు తగ్గిపోవడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతోపాటు, పాసులపై వెళ్లేవారు ఆటోలను ఆశ్రయించడం కనిపించింది. తరచూ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తుండడంతో సాధారణ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల నుంచి ప్రయివేటు వాహనాల వైపు మళ్లుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని