logo

అంబేడ్కర్‌ గొప్ప మానవతావాది: కలెక్టర్‌

బాబాసాహెబ్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో అంబేడ్కర్‌ వర్ధంతి నిర్వహించారు.

Updated : 07 Dec 2022 04:27 IST

ఎలమంచిలి ఆసుపత్రిలో వైద్యసేవలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: బాబాసాహెబ్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో అంబేడ్కర్‌ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా, న్యాయకోవిదుడుగా, గొప్ప మానవతావాదిగా అంబేడ్కర్‌ పేరు తెచ్చుకున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

భూ సర్వేలో లోపాలు రానీయొద్దు

అనకాపల్లి పట్టణం: జిల్లాలో చేపడుతున్న సమగ్ర భూ సర్వే నూరుశాతం కచ్చితత్వంతో చేపట్టాలని కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలో మంగళవారం జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రీ సర్వే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రికార్డుల ప్రకారం ముందుగా గ్రామ సరిహద్దులను గుర్తించి డ్రోన్లతో ప్రభుత్వ, ప్రైవేటు, వ్యక్తిగత భూములను సర్వే చేయాలన్నారు. సంయుక్త కలెక్టర్‌ కల్పనాకుమారి మాట్లాడుతూ కోర్టు కేసులు, పాత సర్వేలో నమోదైన పొరపాట్లుంటే వెంటనే తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్‌డీఓలు చిన్నికృష్ణ, జయరాం, సర్వేశాఖ ఏడీ కరుణాకర్‌ పాల్గొన్నారు.

సేవలపై నమ్మకం కలిగించాలి

ఎలమంచిలి: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని కలెక్టర్‌ రవి సూచించారు. ఎలమంచిలిలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తపేట ఉన్నత పాఠశాలకు వచ్చి విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్లు చూశారు. పట్టణంలోని తులసీనగర్‌ జగనన్న కాలనీని పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం వేగంగా జరగడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి వసతులపై లబ్ధిదారులతో మాట్లాడారు. పక్కనే నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనాలు పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి రేగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. వైద్యులు సిబ్బందితో మాట్లాడారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమాన్ని అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కమిషనర్‌ కృష్ణవేణి, డీఎంహెచ్‌ఓ హేమంత్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని