logo

దాడి కేసులో ఆరుగురి అరెస్టు

నర్సీపట్నానికి చెందిన కొందరు తనపై దాడి చేసి గాయపరిచారని, కులం పేరుతో దూషించారని పెదబొడ్డేపల్లికి చెందిన ఉర్ల నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదుపై ఆరుగురిని అరెస్టు చేశామని పట్టణ సీఐ సీహెచ్‌.గణేష్‌ తెలిపారు.

Published : 07 Dec 2022 03:05 IST

హోంగార్డు పాత్రపై విచారణ

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: నర్సీపట్నానికి చెందిన కొందరు తనపై దాడి చేసి గాయపరిచారని, కులం పేరుతో దూషించారని పెదబొడ్డేపల్లికి చెందిన ఉర్ల నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదుపై ఆరుగురిని అరెస్టు చేశామని పట్టణ సీఐ సీహెచ్‌.గణేష్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడుతూ బీసీ కాలనీకి చెందిన షేక్‌ జిలానీ (25), చిక్కాల సాయిసంతోష్‌ అలియాస్‌ పుచ్చకాయల సాయి (24), కృష్ణాబజారుకు చెందిన పుర్రే దుర్గాప్రసాద్‌ ఎలియాస్‌ అరటిపండ్ల దుర్గ (28), పీనారిపాలేనికి చెందిన నాగుమంత్రి కామేశ్వరరావు (21), ఐదురోడ్ల కూడలిలోని తోటవారి వీధికి చెందిన కంచుపాటి సూర్యప్రకాశ్‌ (20), ఎస్సీ కాలనీకి చెందిన కదిరి స్వామిని (27) అరెస్టు చేసినట్టు వివరించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారన్నారు. ఈ కేసులో ప్రసాద్‌ అనే హోంగార్డుపైనా ఫిర్యాదు ఉందని, ఆయన పాత్రపై విచారణ చేస్తున్నామని సీఐ వివరించారు.

జు పెదబొడ్డేపల్లి రైతుబజారు చేపల మార్కెట్‌ వద్ద జరిగిన గొడవలో తనపై 30 మంది దాడి చేసినట్టు కదిరి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ వివరించారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని వివరించారు. గొడవల్లో తలదూర్చుతున్న కొంతమంది యువకులను గుర్తించామని సీఐ తెలిపారు. వీరందరినీ మండల మేజిస్ట్రేట్‌ వద్ద బైండోవర్‌ చేయిస్తామని తెలిపారు. యువకులంతా వివాదాలకు దూరంగా ఉండాలని సీఐ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని