ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
నాగేశ్వరరావు ఆరోగ్యం ఎలా ఉంద’ని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావును ఆత్మీయంగా పలకరించారు
ప్రగడతో అధినేత చంద్రబాబు
అధినేతకు పార్టీ పరిస్థితి వివరిస్తున్న నాగేశ్వరరావు
అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ‘నాగేశ్వరరావు ఆరోగ్యం ఎలా ఉంద’ని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావును ఆత్మీయంగా పలకరించారు. అమరావతిలో బుధవారం చంద్రబాబునాయుడుతో ప్రగడ సమావేశమయ్యారు. ఇటీవల కిడ్నీ మార్పిడి చేయించుకున్న ప్రగడతో ఆరోగ్య విషయాలను మాట్లాడుతూనే పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నియోజకవర్గంలో తెదేపా బలం, బలహీనతలు తన వద్ద ఉన్న సమాచారాన్ని ప్రగడతో పంచుకోవడంతో పాటు సమస్యలపై అధినేత నేరుగా మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారని ప్రగడ తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను జాగృతి చేయాలని చెప్పారని ప్రగడ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: టీమ్ఇండియా ‘తగ్గేదేలే’.. నెట్‌బౌలర్లుగా నలుగురు టాప్ స్పిన్నర్లు!
-
Movies News
vani jayaram: ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత
-
Politics News
TS Assembly: దేశం చూపు కేసీఆర్ వైపు.. సంక్షేమంలో మాకు తిరుగులేదు: కేటీఆర్
-
India News
కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. భారత ఔషధ సంస్థలో అర్ధరాత్రి తనిఖీలు
-
Movies News
butta bomma review: రివ్యూ: బుట్టబొమ్మ
-
Politics News
Raghunandanrao: వారికి రూ.5 లక్షలు కాదు.. రూ.7.50 లక్షలు ఇవ్వండి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు