logo

‘అధికారంలో ఉండి గర్జనలేంటి?’

అధికారంలో ఉన్నవారు గర్జనలు పెట్టడం సిగ్గుచేటని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.

Published : 08 Dec 2022 05:23 IST

డీఆర్వో వెంకటరమణకు వినతి పత్రం ఇస్తున్న అయ్యన్న, బుద్ద, పీలా, కుమార్‌, రాజు తదితరులు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అధికారంలో ఉన్నవారు గర్జనలు పెట్టడం సిగ్గుచేటని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద తెదేపా జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులంతా ‘ఇదేం ఖర్మ బీసీలకు’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో పాల్గొన్న అనిత మాట్లాడుతూ బీసీలకు ముఖ్యమంత్రి జగన్‌ చేసిన మోసం అందరికీ తెలుసన్నారు. వెనుకబడిన వర్గాల కోసం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆదరణ పథకాన్ని నిలిపేయడమే కాకుండా పరికరాలను నిరుపయోగంగా వదిలేశారన్నారు. అన్ని విధాలుగా ప్రభుత్వం చేతిలో బీసీలు మోసపోయారన్నారు. అనంతరం తెదేపా జిల్లా కార్యాలయానికి రెండు ఎకరాల స్థలం కేటాయించాలని, బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మాజీ మంత్రి అయ్యన్న, తెదేపా నాయకులంతా కలిసి డీఆర్వో వెంకటరమణను కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, రాజు, రామానాయుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు తాతయ్యబాబు, పి.వి.జి.కుమార్‌, పైలా ప్రసాదరావు, లాలం భాస్కరరావు, కాశినాయుడు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, సురేంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని