logo

అంతులేని ఆర్తనాదం

ఒకే ఒక్క అడుగు అలా ముందుకు పడింది..అంతే...ప్రమాదం చుట్టేసింది! విద్యార్థిని నిత్యం ప్రయాణించే రైలే..రోజూ దిగే రైల్వే స్టేషనే..అయినా...బుధవారం ఉదయంఆ క్షణంలో ఊహకందని ప్రమాదమిది!!

Published : 08 Dec 2022 05:35 IST

ఒకే ఒక్క అడుగు అలా ముందుకు పడింది..
అంతే...ప్రమాదం చుట్టేసింది!
విద్యార్థిని నిత్యం ప్రయాణించే రైలే..
రోజూ దిగే రైల్వే స్టేషనే..
అయినా...బుధవారం ఉదయం
ఆ క్షణంలో ఊహకందని ప్రమాదమిది!!
ఉదయం 8.42 గంటలకు...
ఆగిన రైలు... ప్లాట్‌ఫాంకు మధ్యలోకి
ఆమె హఠాత్తుగా  జారిపోయింది!
దువ్వాడ రైల్వే స్టేషన్‌లో
ఒక్కసారిగా అలజడి రేగింది!
క్షణాలు..నిమిషాలు గడిచే కొద్దీ
ఎటూ కదల్లేని స్థితిలో...
అటు తిరగాలంటే భారీ రైలు బోగీ
ఇటు తిరగాలంటే కాంక్రీటు గోడ
నడుమ నలిగిపోతున్న శరీరం!
విద్యార్థిని శశికళ రోదిస్తూ...
కన్నీటిపర్యంతమవుతూ...బాధను భరిస్తూ
చేసిన ఆర్తనాదాలు అయ్యో! అనిపించాయి.!!

ఎంసీఏ మొదటి ఏడాది చదువుతున్న ఈ విద్యార్థిని  గంటన్నరపాటు పడిన యాతన అంతా ఇంతా కాదు. రైల్వే యంత్రాంగం శ్రమించి బయటకు తీసి...ఆసుపత్రికి తరలించింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. -న్యూస్‌టుడే, కూర్మన్నపాలెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని