logo

మా ప్రాణమా.. తిరిగిరావా!!

ఒక్కగానొక్క కూతురు విషమ పరిస్థితిని జయించి ప్రాణాలతో తిరిగొస్తుందని దాదాపు 30 గంటల పాటు నిరీక్షించిన ఆ తల్లిదండ్రుల ఆశలన్నీ అడియాశలయ్యాయి!

Updated : 09 Dec 2022 06:25 IST

శశికళ తల్లిదండ్రుల రోదన
చికిత్స పొందుతూ కన్నుమూసిన విద్యార్థిని

ఒక్కగానొక్క కూతురు విషమ పరిస్థితిని జయించి ప్రాణాలతో తిరిగొస్తుందని దాదాపు 30 గంటల పాటు నిరీక్షించిన ఆ తల్లిదండ్రుల ఆశలన్నీ అడియాశలయ్యాయి!! బిడ్డతో గడిపిన క్షణాలు గుర్తొచ్చిన ప్రతి క్షణం   కన్నీళ్లు సంద్రమయ్యాయి! ఆమె జ్ఞాపకాలు కళ్లముందు మెదిలిన ప్రతిసారి... దుఃఖం కట్టలు తెంచుకుంది! ఇక లేదని..తిరిగి రాదనే విషయం జీర్ణించుకోలేక.. మనసును స్థిమితపర్చుకోలేక నరకయాతన అనుభవించారు!! శశికళతో స్నేహబంధం.. కళాశాలలో గడిపిన సమయం.. చదువులో ఎదిగిన తీరు రోజంతా చర్చించుకున్న మిత్రులు.. ఆమె ప్రాణాలతో తిరిగి రావాలని ఎంతగానో ఆశించారు!

ప్రమాదంలో చిక్కి విలవిల్లాడుతూ..

* ఇలా కోటి ఆశలతో ఎదురు చూసిన వారిపై విధి పగపట్టినట్లు... విద్యార్థిని మరణవార్త చేరవేసింది. అందరి గుండెల్లో కల్లోలం రేపింది. బుధవారం దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బోగీకి, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయి ఆసుపత్రిలో చికిత్సకు చేరిన ఎంసీఏ విద్యార్థిని మృత్యువుతో పోరాడి గురువారం మధ్యాహ్నం కన్ను మూయడం ఎందరినో కలచివేసింది.

- న్యూస్‌టుడే, కూర్మన్నపాలెం, అక్కిరెడ్డిపాలెం

ఆసుపత్రి వద్ద విషాదంలో యువతి తండ్రి, కుటుంబీకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని