logo

‘నౌకాదళం’.. రక్షణ వలయం

భారతీయ నౌకాదళం సరికొత్త అంశాలతో కూడిన ఓ లఘుచిత్రాన్ని గురువారం విడుదల చేసిందని నేవీ వర్గాలు తెలిపాయి.

Published : 09 Dec 2022 05:42 IST

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఆన్‌బోర్డుపై అధికారులు, నావికులు

సింధియా, న్యూస్‌టుడే : భారతీయ నౌకాదళం సరికొత్త అంశాలతో కూడిన ఓ లఘుచిత్రాన్ని గురువారం విడుదల చేసిందని నేవీ వర్గాలు తెలిపాయి. ఇటీవల నౌకాదళానికి చెందిన జెండాను మార్పు చేసి, కొత్తగా ఆవిష్కరించిన అంశం నుంచి నౌకాదళ దినోత్సవం వరకు అన్నింటినీ పొందుపరుస్తూ లఘుచిత్రంగా రూపొందించారు. ఇందులో భారతీయ నౌకాదళం అందిస్తున సేవలు, యుద్ధనౌకల నిర్మాణం, సాగరజలాల్లో నౌకల విధులు, యుద్ధనౌకల రవాణా, భారీ నౌకగా పేరొందిన ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ను భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయడం... తదితర అంశాలకు చోటు కల్పించారు. అలాగే విక్రాంత్‌ నౌక ఆన్‌బోర్డుపై అధికారులు, నావికులు గౌరవ వందనం చేస్తున్న దృశ్యం, నావికులకు శిక్షణ ఇస్తున్న ‘ఐఎన్‌ఎస్‌ చిలకా’ ప్రాంగణం, శిక్షణ అంశాలకు సంబంధించిన దృశ్యాలు ఆకట్టుకునే రీతిలో ఉండటం విశేషం. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలు, ఏడు ఖండాల్లో జాతీయ జెండా ఎగురవేసిన సన్నివేశాలు, స్వచ్ఛభారత్‌, పునీత్‌సాగర్‌ అభియాన్‌ వంటివి ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించిన లఘుచిత్రం ఆంగ్లం, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నాయి.


నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌తో విన్యాసం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని