logo

విశాఖ వాసి.. యాత్రా పిపాసి..

ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి పి.శ్రీవాత్సవ్‌ ప్రపంచంలోనే ఎత్తైన ఉమ్‌లింగ్‌లాను తాకి వచ్చాడు.

Published : 09 Dec 2022 05:42 IST

ఉమ్‌లింగ్‌లా వద్ద శ్రీవాత్సవ

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి పి.శ్రీవాత్సవ్‌ ప్రపంచంలోనే ఎత్తైన ఉమ్‌లింగ్‌లాను తాకి వచ్చాడు. ‘ట్రావెల్‌ ఫొటో హాబీగా ఉన్న శ్రీవాత్సవ్‌ గతంలో ఒకసారి రామేశ్వరం వరకు మోటారు సైకిల్‌పై వెళ్లి వచ్చాడు. ఆ అనుభవంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి ఉమ్‌లింగ్‌లాను వెళ్లివచ్చాడు. ఇది లేహ్‌ నగరానికి సమీపంలో ఉంది. ఇది హిమాలయాల శ్రేణుల మధ్య ఉంది. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 19024 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని ప్రపంచలోనే అత్యంత ఎత్తైన మోటార్‌ రహదారిగా గుర్తించారు. సాధారణంగా బైకర్లు ఈ ట్రిప్‌ను 3500 సీసీ బైక్‌లను ఉపయోగిస్తుంటారు. శ్రీవాత్సవ మాత్రం కేవలం 200 సీసీతో ఇది పూర్తి చేయడం గమనార్హం. ఈ సాహస యాత్ర దాదాపు తొమ్మిదివేల కిలోమీటర్ల సాగింది. సగటున రోజుకు 4 వందల నుంచి 6 వందల కిలోమీటర్లు నడిపాడు. తర్వాత కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లాలనేది తన కోరికగా పేర్కొన్నాడు. విశాఖకు తిరిగి వచ్చిన సందర్భంగా యాత్రా వివరాలను తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని