logo

హాకీ పోటీల్లో హోరాహోరీ

నక్కపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి హాకీ పోటీలు, ఎంపికలు హోరాహోరీగా జరిగాయి.

Updated : 09 Dec 2022 06:29 IST

నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి హాకీ పోటీలు, ఎంపికలు హోరాహోరీగా జరిగాయి. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌.జి.ఎఫ్‌.) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను ఉప ఎంపీపీ వీసం నానాజీ తదితరులు ప్రారంభించారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్కరూ సాధన చేయాలని సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు పాఠశాలలనుంచి 220 మంది హాజరయ్యారు. వీరంతా జట్లుగా ఏర్పడ్డారు. అనంతరం నువ్వా.. నేనా అన్నట్లు పోటీపడటంతో మైదానంలో విద్యార్థులు, క్రీడాకారులు చప్పట్లతో ఉత్సాహపరిచారు. నక్కపల్లి ఉన్నత పాఠశాలతోపాటు, బాలికల ఉన్నత పాఠశాల, ఎస్‌.రాయవరం మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు బాలురు, బాలికల విభాగంలో నక్కపల్లి ప్రథమ, ద్వితీయ స్థానంలో ఎలమంచిలి జట్లు నిలిచినట్లు నియోజకవర్గ వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయకర్త కుందూరు రాజు తెలిపారు. వీరంతా త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. విజేతలకు సబ్‌ రిజిస్ట్రార్‌ గౌస్య బేగం, ఉప సర్పంచి వీసం రాజు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌.జి.ఎఫ్‌. కార్యదర్శి శేఖర్‌, రమేష్‌ నాయుడు, కిరణ్‌, పాఠశాల కమిటీ ఛైర్‌పర్సన్‌ కర్రి పద్మ, కోచ్‌లు సింహాచలం, సాయిబాబు, బి.ఎస్‌. హాకీ క్లబ్‌ వ్యవస్థాపకులు బలిరెడ్డి సూరిబాబు, కార్యదర్శి కొల్నాటి తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని