logo

రేషన్‌ పంపిణీలోనూ అవినీతి: సోము వీర్రాజు

చౌక దుకాణాల ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.

Updated : 21 Jan 2023 07:18 IST

సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు, తదితరులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: చౌక దుకాణాల ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. భాజపా వైద్య విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం బీచ్‌ ప్రకృతి చికిత్సాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్‌ సరకులను అధిక శాతం కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. అందులోనూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. నాణ్యతలేని, నాసిరకం సరకులను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి పంపిణీ చేస్తోందన్నారు. రేషన్‌ వాహనాలపై ప్రధానమంత్రి మోదీ చిత్రాన్ని ముద్రించాలన్నారు. ప్రధాని రాష్ట్రానికి చేస్తున్న సాయం కారణంగా రానున్న ఎన్నికల్లో ఇక్కడ భాజపా అధికారంలోకి వస్తుందన్నారు. ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, రాష్ట్ర యువమోర్చ అధ్యక్షులు కేతినేని సురేంద్ర, పార్టీ నగర అధ్యక్షులు రవీంద్రారెడ్డి, నేతలు విజయానందరెడ్డి, రుపాకుల రవికుమార్‌, రామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని