విధుల్లో ఇంత బాధ్యతారాహిత్యమా?
విధుల్లో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ మండిపడ్డారు.
పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ ఆగ్రహం
నాడు-నేడు పనులపై అధికారిని ప్రశ్నిస్తున్న ప్రవీణ్ ప్రకాశ్
నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: విధుల్లో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ మండిపడ్డారు. పెదబొడ్డేపల్లి జడ్పీ హైస్కూల్లో రూ.72 లక్షలతో నాడు-నేడు కింద చేపట్టిన పనులను శనివారం తనిఖీ చేశారు. భవనాన్ని ఇరుకుగా ఉన్న చోట నిర్మించడం గమనించిన ఆయన ఇలా కట్టేస్తే ఎలా అని అధికారులను నిలదీశారు. ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ‘ఓ భవనం నిర్మించాలంటే పట్టణ ప్రణాళిక విభాగం మార్గదర్శకాల ప్రకారం చుట్టూ తగినంత ఖాళీ స్థలం ఉండాలి. ఇక్కడ ఎందుకు పాటించలేదు. ప్రభుత్వ భవనాలు ఎలా కట్టుకున్నా ఫర్వాలేదనుకుంటున్నారా. ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతార’ంటూ మందలించారు. రాష్ట్రంలో ఇప్పటికే భవనాలకు సంబంధించి 14 వ్యాజ్యాలు హైకోర్టులో ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిర్మించే వాటిని అన్ని అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. హైస్కూల్‌ను ఆనుకుని ఎయిడెడ్ హైస్కూల్ ఆవరణ ఖాళీగా ఉండటం గమనించిన ఆయన ఈ భవనం అక్కడ కట్టొచ్చు కదా... పిల్లలు అంతస్తులు ఎక్కేందుకు ఇబ్బంది పడతారని తెలియదా అని ప్రశ్నించారు. ఆ స్థలం ఆర్సీఎం సంస్థదని స్కూల్ కమిటీ ఛైర్మన్ విజయకుమార్ చెప్పగా.. పిల్లలంతా మనవాళ్లే కదా అన్నారు. స్థలం అందుబాటులో లేకపోతే ప్రైవేటు స్థలాలను భూసేకరణ ద్వారా తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాకు ఎన్ని భవనాలు మంజూరయ్యాయి, పనుల పురోగతి ఏంటన్నది అక్కడే అధికారులతో సమీక్షించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!